![]() |
![]() |

కార్తీక దీపం సీరియల్ లో మోనిత రోల్ లో ఎంతో ఫేమస్ అయ్యింది సోబాశెట్టి. ఆ నేమ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 7 లో స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్స్ లో ప్రియాంక జైన్, శోభా శెట్టి ఇద్దరూ పోటా పోటీగా ఆడారు. ఇక చివరికి శోభా 14వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక తన కెరియర్ లో బిజీ అయ్యింది. అలాగే తన లవర్ యశ్వంత్ ని కూడా అందరికీ పరిచయం చేసింది.
యశ్వంత్ ఎవరో కాదు కార్తీక దీపం సీరియల్ లో ఆదిత్య రోల్ లో కనిపించిన వ్యక్తి. రీసెంట్ గా ఒక షోలో వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. మూడేళ్ళుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు తమ ప్రేమను అందరికీ చెప్పారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈమె బుల్లితెర సీరియల్స్ నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తోంది. అలాగే ఈమె బ్యూటిషియన్ గా క్లాసెస్ కూడా చెప్తూ ఉంటుంది. ఆ క్లాసెస్ కి సంబందించిన వీడియోస్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా తన పేరెంట్స్ తో, తన లవర్ తో కలిసి హోమ్ టూర్ వీడియో చేసింది మోనిత. ఈమె కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు ఆ వీడియోలో చెప్పింది. ఐతే ప్రస్తుతం ఇంటి పనులు జరుగుతున్నాయనే విషయాన్నీ తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా ఈమె లివింగ్ ఏరియా కిచెన్ తో సహా ప్రతి ఒక్క రూమ్ ని చూపించి ఆ విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం హౌస్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యిందని ఇంటీరియర్ డిజైన్ మిగిలే ఉందని చెప్పింది శోభా శెట్టి. ఇక ఆ ఇంటికి మొత్తం యశ్వంత్ టేస్ట్ కి తగ్గట్టుగా ఇంటీరియర్ డిజైనర్ గా పని చేయిస్తున్నట్లు అతను ఎలా చెప్తే అలా డిజైన్ చేయిస్తున్నట్లు చెప్పింది శోభా. అంతేకాకుండా ఈ ఇంటికి యశ్వంత్ శోభ నిలయం అని పేరు కూడా పెట్టుకున్నట్లు చెప్పింది శోభా.
![]() |
![]() |